English   

ఎఫ్3 సెట్ లో వరుణ్ తేజ్

 Varun Tej
2021-01-12 13:02:04

ఎఫ్-2 సినిమా బ్లాక్ బస్టర్ తరవాత ఆ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్-3 ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్నారు. ఎఫ్-2 థియేటర్లలో లలో నవ్వులు పూయించడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. దాంతో ఎఫ్-3 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎఫ్-3 సినిమా షూటింగ్ లో నిన్న వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిజానికి వరుణ్ తేజ్ ఎప్పుడో షూటింగ్ కు రావాల్సి ఉంది కాని ఆయనకు కరోనా రావడంతో షూటింగ్ కు రాలేకపోయారు. ఇక ఇటీవల ఆయన కరోనా ను జయించడంతో షూటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ కు వెల్ కమ్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ఫన్ మొదలయింది అంటూ పేర్కొన్నారు. మరోవైపు షూటింగ్ అద్భుతంగా జరిగిందని..మళ్ళీ రేపు కలుద్దామని వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు.

More Related Stories