English   

బాక్సాఫీస్ పోటీలోకి బాలయ్య... బీబీ3 రిలీజ్ డేట్ 

 Balakrishna Boyapati Srinu
2021-02-01 08:56:48

సింహా, లెజెండ్ సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గత కొన్నిరోజుల నుంచి టాలీవుడ్ లో బిగ్ స్టార్ మొత్తం తమ సినిమా రిలీజ్‌ డేట్స్‌తో అలరిస్తున్నారు. ఈ తరుణంలో బాలయ్య-బోయపాటి టీమ్‌ ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టీజ‌ర్‌లో మాస్‌ లుక్‌లో అద‌ర‌గొట్టిన బాలయ్య.. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 

బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను హిట్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం.రత్నం మాటలు రాశారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటర్లు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

More Related Stories