English   

సెప్టెంబర్ 3న థియేటర్ లలో ”డియర్ మేఘ”

Dear-megha-on-sep-3
2021-08-18 20:49:42

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. ”డియర్ మేఘ” చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం టీమ్ మెంబర్స్ వెయిట్ చేశారు. థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ”డియర్ మేఘ” కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ”డియర్ మేఘ” సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది.. ”డియర్ మేఘ” సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు కలిగిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. హరి గౌర కంపోజ్ చేసిన ”డియర్ మేఘ” పాటలు హిట్ కాగా, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

More Related Stories