English   

రేస్ 3 ప్లాప్ కు అసలు కారణం

Reason Behind Salman's Race 3 Movie Flop
2018-09-24 06:01:44

ఏ సినిమా అయినా ద‌ర్శ‌కుడికి పూర్తిగా వ‌దిలేస్తే మంచిది.. అలా కాద‌ని హీరోలే డైరెక్ష‌న్ చేస్తుంటే క‌చ్చితంగా ఆ సినిమా ఫ‌లితంపై ప్ర‌భావం ప‌డుతుంది. ఇప్పుడు స‌ల్మాన్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న వ‌ర‌స విజ‌యాల‌కు మ‌రోసారి బ్రేక్ వేసింది రేస్ 3. ఈ ఏడాది వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. స‌ల్మాన్ ఉన్నాడు కాబ‌ట్టి.. రంజాన్ కు వ‌చ్చింది కాబ‌ట్టి మూడంటే మూడే రోజులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అరాచ‌కం చేసింది ఈ చిత్రం. కంటెంట్ తో ప‌నిలేకుండా స్టార్ హీరో సినిమా చూడాల‌నే ఆశ‌లో రేస్ 3ని తొలి మూడు రోజులు నెత్తిన పెట్టుకున్నారు ఆడియ‌న్స్. త‌ర్వాత ఈడ్చి తంతే ఎక్క‌డో పోయి ప‌డింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్లాప్ పై ద‌ర్శ‌కుడు రెమో డిసౌజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసాడు. స‌ల్మాన్ ఖాన్ కెలికాడు.. క‌థ‌లో వేలు పెట్టాడు.. ఆయ‌న చేయ‌డం వ‌ల్లే సినిమా ఫ్లాప్ అయింద‌ని ఓపెన్ గానే చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

క‌థ మొద‌లైన‌పుడు వేరుగా ఉంది.. అది తెర‌కెక్కేట‌ప్పుడు వేరుగా ఉంది.. పూర్త‌య్యేనాటికి మ‌రోలా ఉంద‌న్నాడు రెమో. స‌ల్మాన్ ఖాన్ ను విల‌న్ రోల్ లో చూడ‌రంటూ మాటిమాటికి క‌థ‌ను కెలికేసార‌ని.. అందుకే సినిమా ఫ్లాప్ అయింద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తం స‌ల్మాన్ సొంతంగా చేసుకున్న ఫ్లాప్ సినిమా రేస్ 3 అని సెన్సేష‌నల్ క‌మెంట్స్ చేసాడు ఈయ‌న‌. దీనిపై స‌ల్మాన్ ఇంకా స్పందించ‌లేదు కానీ అందులో నిజం కూడా లేక‌పోలేదు. రేస్ 3 సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కు బిల్డ‌ప్ త‌ప్ప ఇంకేం లేద‌ని ఆడియ‌న్స్ కూడా తేల్చేసారు. అందుకే మ‌రి అనేది.. ఎవ‌రు చేసే ప‌ని వాళ్లు చేయాల‌ని..!

More Related Stories