English   

ద‌స‌రా రేస్.. మిగిలింది ముగ్గురే..!

Aravinda-Sametha
2018-07-17 17:20:53

ద‌స‌రా అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి.. ప‌ది రోజులు హాలీడేస్ వ‌స్తాయి క‌దా అందుకే ప్ర‌తీ హీరో త‌మ సినిమాను ఈ పండ‌క్కే తీసుకు రావాలని కోరుకుంటాడు. దానికి మ‌రో కార‌ణం కూడా లేక‌పోలేదు. సెల‌వులు ఉంటాయి కాబ‌ట్టి సినిమా కాస్తా అటూఇటూగా ఉన్నా పాస్ అయిపో తుంది. ఇదే ఇప్పుడు మ‌న హీరోల‌కు కూడా కావాల్సింది. అందుకే 2018 ద‌స‌రా కూడా బాగా హీట్ ఎక్కిపోతుంది. బాల‌య్య‌, అఖిల్ ఇలా చాలా మంది ముందు ఈ రేస్ లో ఉన్నా.. ఇప్పుడు చివ‌రివ‌ర‌కు నిల‌బ‌డుతుంది మాత్రం ఎన్టీఆర్ ఒక్క‌డే. ముందు నుంచి చెప్పిన‌ట్లే ఈయ‌న అక్టోబ‌ర్ 12న అర‌వింద స‌మేతతో రానున్నాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. 

ఇక ఈయ‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోలు కూడా ఇప్పుడు ద‌స‌రా వార్ లో ఉన్నారు. వాళ్లే విశాల్ అండ్ రామ్. అక్టోబ‌ర్ 18నే ఇద్ద‌రూ త‌మ సినిమాల‌తో వ‌స్తున్నారు. అభిమ‌న్యుడు స‌క్సెస్ త‌ర్వాత విశాల్ ను ఇక్క‌డ త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. ఈయ‌న సినిమాలు ఈజీగా హిట్టైతే 10 కోట్ల‌కు పైగానే క‌లెక్ట్ చేస్తున్నాయి. దానికితోడు పందెంకోడి 2తో వ‌స్తున్నాడు కాబ‌ట్టి ఆ అంచ‌నాలు కూడా ఉంటాయి. ఇక రామ్ కూడా దిల్ రాజుతో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటూ వ‌స్తున్నాడు. ఈ మూడు సినిమాల వార్ తో ఈ ద‌స‌రా మ‌రింత రంజుగా మార‌బోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అయితే లేదు. 

More Related Stories