English   

మ‌హేశ్ అద్భుతానికి మూడేళ్ళు.. 

Mahesh-Babu

వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు.. అభిమానుల్లో హై టెన్ష‌న్.. మ‌హేశ్ లో కంగారు.. పైగా అప్ప‌టికే విడుద‌లైన బాహుబ‌లి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో విడుద‌లైంది శ్రీ‌మంతుడు. స‌రిగ్గా మూడేళ్ల కింద‌.. ఆగ‌స్ట్ 7న విడుద‌లైంది ఈ సినిమా. మ‌హేశ్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే వ‌చ్చిన ఈ సినిమా.. ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. కొర‌టాల శివ తెర‌కెక్కించిన శ్రీ‌మంతుడు రికార్డులు తిర‌గ‌రాసింది. బాహుబ‌లి త‌ర్వాత రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది ఈ సినిమా. అప్ప‌ట్లోనే 84 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది శ్రీ‌మంతుడు.  గ్రామ‌ద‌త్త‌త కాన్సెప్ట్ తో వ‌చ్చిన ఈ సినిమా.. మ‌హేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాదు.. మ‌హేశ్ కు ఉత్త‌మ‌న‌టుడి అవార్డుల‌ను కూడా తీసుకొచ్చింది. ఎంతోమంది సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు శ్రీ‌మంతుడు చూసి గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఈ సినిమా మూడేళ్లు పూర్తైన సంద‌ర్భంగా నిర్మాత‌లు మైత్రి మూవీ మేక‌ర్స్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. మ‌హేశ్ కూడా త‌న కెరీర్ లో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు కొర‌టాల శివకు ఎప్పుడూ రుణ‌ప‌డే ఉంటానంటున్నాడు. ఆ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను కూడా బాగానే ఆడింది. ప్ర‌స్తుతం ఈయ‌న వంశీ పైడిప‌ల్లి రిషి సినిమాతో బిజీగా ఉన్నాడు.

More Related Stories