English   

బండ్ల గ‌ణేష్ పై 30 ఇయ‌ర్స్ పృథ్వీ సెటైర్లు.. 

Prudhvi-Raj
2018-11-27 04:53:20

క‌మెడియ‌న్లు కాస్తా ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసారు. ఈ సారి ఎన్నిక‌ల్లో సినిమా వాళ్లు త‌క్కువ‌గానే ఉన్నా.. ఎందుకో తెలియ‌దు కానీ కామెడీ స్టార్స్ మాత్రం ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే మొత్తం ఎన్నిక‌ల కామెడీని త‌న భుజాల‌పై వేసుకున్నాడు బండ్ల గ‌ణేష్. ఈయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఇంటర్వ్యూల్లో తోలు తీస్తున్నాడు. ఈ మ‌ద్యే ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ‌లో కానీ కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే తాను బ్లేడ్ తీసుకుని కోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసాడు. దీనిపై ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ సెటైర్లు వేసాడు.

బండ్ల గ‌ణేష్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని.. అయితే తెలంగాణ‌లో కాంగ్రెస్ రాక‌పోతే ఆయ‌న సుసైడ్ చేసుకుంటాన‌ని చెప్ప‌డం భ‌యంగా ఉంద‌ని సెటైర్లు వేసాడు. ఆయ‌న్ని చ‌నిపోకుండా ఎవ‌రైనా ఆపాలని.. ఎందుకంటే తెలంగాణ‌లో రాబోయేది కేసీఆరే అని జోస్యం చెప్పాడు ఈ క‌మెడియ‌న్. ఇక్క‌డ తెలంగాణ అభివృద్దికి పాటుప‌డుతుంది కేసీఆర్ ఒక్క‌డే అని.. ప్ర‌జా కూటమికి కానీ ఓటేస్తే క‌చ్చితంగా న‌ష్ట త‌ప్ప‌ద‌ని చెప్పాడు ఈయ‌న‌.

అందుకే బండ్ల గ‌ణేష్ రేపు ఎన్నిక‌ల త‌ర్వాత ఏం చేసుకోకుండా కాప‌లాగా ఉండాల‌ని కోరుకున్నాడు పృథ్వీ. బ‌య‌ట ఎలా ఉన్నా సినిమాల ప‌రంగా అంతా ఒక్క‌టే అని చెప్పాడు ఈయ‌న‌. కానీ ఈయ‌న మాట‌ల్లో మాత్రం ఎట‌కారం కేజీల లెక్క‌న కాదు.. ఏకంగా ట‌న్నుల్లో క‌నిపిస్తుంది. 

More Related Stories