English   

30 గంటలు అయినా నాన్ స్టాప్ గా చేస్తుందట

rakul
2019-05-11 07:40:01

టాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది టాలెంటేడ్ నటీమణులలో రకుల్ ప్రీత్ ఒకరు. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణీ అవుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగార్జున సరసన మన్మథుడు2, తమిళంలో సూర్య ఎన్జీకే సినిమాల్లో నటిస్తోంది. ఇక మరోపక్క బాలీవుడ్ లో ఆమె నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా మే 17న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని చాలా మంది కలలు కంటారు అనీ అది చాలా తక్కువ మందికి ఛాన్స్ వస్తుందని, ఇండస్ట్రీలో తనకు దక్కిన స్థానం చూసుకొని గొప్పగా ఫీల్ అవుతాననీ చెప్పుకొచ్చింది, ఇక జయాపజయాలు మన చేతిలో ఉండవనిఆమె చెప్పుకొచ్చింది. అంతే కాక కష్టపడి పనిచేయడాన్ని తాను ఆస్వాదిస్తానని అసలు పనిని తను ఎంతగా ప్రేమిస్తానంటే 30 గంటలపాటు పని చేసినా అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేయ‌గ‌ల‌నంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.

More Related Stories