English   

ప్రభాస్ సినిమా కోసం 30 కోట్ల సెట్

prabhas
2019-05-18 08:07:54

బాహుబ‌లి త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్ర‌భాస్ సాహో సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా కూడా చాలా టైం టేకింగ్ మూవీ కావడం వలన దీనితో పారలల్ గా మరో మూవీ చేస్తున్నాడు. ఇక సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సాహో ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ప్రభాస్ సాహో తో పాటుగా జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌తో మ‌రోచిత్రం చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగును ఇప్పటికే యూరోప్ లో కొంత షూట్ చేశారు. అక్కడి పార్ట్ పూర్తి కావడంతో యూనిట్ అంతా తాజగా షూటింగ్ ని హైద‌రాబాద్ కు మార్చింది. అయితే ఈ సినిమా కోసం 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా ఒక భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అధిక భాగం షూటింగ్ ఈ సెట్ లోనే చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ సెట్ సాంగ్ కోసమా లేక టాకీ కోసమా అనేది తేలాల్సి ఉంది.

More Related Stories