English   

ఇండస్ట్రీలో కులపిచ్చి ఎక్కువ.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలనం..

Prudhvi
2019-10-09 14:00:16

సినిమాలో కామెడీ చేస్తుంటాడేమో కానీ బయట మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీలే చేస్తుంటాడు పృథ్వీ. ఈయనకు ఇప్పుడు రాజకీయాలు కూడా తోడు కావడంతో మనోడు ఆడిందే ఆటలా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేసాడు ఈయన. తాజాగా ఓ ప్రైవేట్ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు 30 ఇయర్స్ పృథ్వీ. 

ముఖ్యంగా ఇండస్ట్రీలో కులపిచ్చి ఎక్కువగా ఉందని.. ఇక్కడ పేర్లను బట్టి కూడా అవకాశాలు వస్తాయని చెప్పాడు. తన పేరు ఫృథ్వీ అయితే కొందరు తనకు పేరు చివర రాజు అని తగిలించుకుంటే ఛాన్సులు బాగా వస్తాయని చెప్పారని.. అలా తన పేరు చూసి రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా మోసపోయారని చెప్పాడు. ఇప్పటికి తన పేరు చూసి మోసపోయానని సరదాగా ఆయన చెబుతుంటారని నవ్వుకున్నాడు. ఇక తనకు ఆఫర్లు రావట్లేదని చెప్పడం కూడా అబద్ధమని.. తక్కువైనట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు 30 ఇయర్స్ పృథ్వీ. కొందరు నిర్మాతలు తనను బ్యాన్ చేశారంటూ వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

మెగా హీరోలు నన్నెందుకు బ్యాన్ చేసారు.. సైరాలో నటించాను కదా అంటున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. చిరంజీవి చాలా మంచి వ్యక్తి.. మితభాషి అంటున్నాడు ఈయన. అలాగే తను ఫృథ్వీ చౌదరీ అని పెట్టుకుని ఉంటే ఛాన్సులు బాగా వచ్చేవని.. చౌదరీ ఉంటే చాలు ప్రతిభలేని వారికి ఛాన్సులు చాలా వచ్చాయని సంచలనం సృష్టించాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఇక పవన్ తో కేవలం రాజకీయ విభేదాలే కానీ పర్సనల్ గా ఏం లేవని చెప్పాడు ఈయన. పవన్ కల్యాణ్ జనసేనను విమర్శించడం తనకు పార్టీపరమైన సిద్ధాంతమే అన్నాడు ఈ కమెడియన్. పవన్‌ను విమర్శిస్తే.. ట్రోల్ చేసేవారు ఒకటి గుర్తించుకోవాలి.. ఆ మధ్య పావలా కల్యాణ్ అంటూ ఓ టీడీపీ నేత విమర్శిస్తే అప్పుడు ఈ జనసైనికులు ఎక్కడికి వెళ్లారు.. పడుకున్నారా.. అప్పుడు మాట్లాడలేదేంటి అంటూ ప్రశ్నిస్తున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. సైరా ఫంక్షన్‌లో తన ఫోటో పెట్టి ట్రోల్ చేయడం చిల్లర వేషాలు అంటున్నాడు ఈయన. 
 

More Related Stories