English   

ప్రేమపాఠాలు నేర్పిస్తున్న యాంకర్ ప్రదీప్.. 30 రోజుల్లో..

pradeep
2019-12-21 20:20:34

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర ఈ మధ్యే 40 రోజులకు పైగా రెస్ట్ తీసుకున్నాడు. ప్రతిరోజు ప్రతి ఇంటి టీవీలో కనిపించే ప్రదీప్ ఒక్కసారిగా ఎన్ని రోజులు మాయం అయిపోయే సరికి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. అవన్నీ చూసి చాలా నవ్వుకున్నాడు ప్రదీప్. చాలా చాలా రోజుల తర్వాత ఈ మధ్యే మళ్లీ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. దాంతో కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆ గాయం అలాగే పట్టుకుని చాలా రోజుల పాటు షూటింగ్ చేశాడు ప్రదీప్. కానీ రోజురోజుకి ఎక్కువవడంతో నొప్పి మరీ భరించలేనంతగా కావడంతో సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. ఇక ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు ప్రదీప్. ఆ టైటిల్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ టైటిల్ తోనే ఇప్పుడు కొత్త దర్శకుడు ఒకరు ప్రదీప్ కు మంచి కథ చెప్పారని.. ఇందులో లవ్ గురుగా ప్రదీప్ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమా కోసం మంచి బడ్జెట్ పెడుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటానంటున్నాడు ఈ యాంకర్. గతంలో యాంకర్స్ హీరోలుగా మారి సక్సెస్ అయింది లేదు.. మరి ప్రదీప్ ఏం చేస్తాడో చూడాలిక.

More Related Stories