English   

పెను వివాదంలో 30 ఇయర్స్ పృథ్వీ...బయటపడిన రాసలీలల టేప్

pru
2020-01-12 07:00:05

పవిత్రమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్న నటుడు పృథ్వీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు కొన్ని మీడియా ఛానెల్స్ ఆడియో క్లిప్స్ ప్రసారం చేస్తున్నాయి. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, వెనక నుండి కౌగించుకుందామని అనుకున్నట్టు మాట్లాడుతున్న ఆ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల టేప్‌ను జనసేనకు చెందిన 99 ఛానల్, అలాగే టీవీ5 ఛానల్ కూడా ప్రసారం చేస్తున్నాయి. ఆ ఆడియో క్లిప్స్ లో పృధ్వి ఆ ఉద్యోగినితో సన్నిహితంగా మాట్లాడుతున్నట్టు అర్ధం అవుతోంది. అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా? అనడం. పడుకునేటప్పుడు? గుర్తు వచ్చానా అని అడగడం చూస్తుంటే ఈ వ్యవహారం ఏదో తేడాగానే ఉంది. ఆ మహిళ సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు అంటే చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా? అనడం, దానికి ఆ మహిళ  మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి అని చెప్పడం ఆ ఆడియోలో వినిపించింది. నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి మార్చి వరకు తాగను,  డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా, నీతో కూర్చుని కంపెనీ తీసుకుని డ్రింక్ చేస్తానని మాట్లాడారు. నువ్వు గుండెల్లో ఉన్నావ్, హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా,  నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదని ఆ మహిళతో మాట్లాడారు. అంతే కాక వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయానని కూడా ఆయన మాట్లాడారు. మరి దీని మీద పృధ్వి ఏమని సమాధానం ఇస్తారో చూడాలి. 

More Related Stories