English   

30 రోజుల్లో ప్రేమించటం ఎలా.. యాంకర్ ప్రదీప్ లవ్ స్టోరీ.. 

Pradeep
2020-01-25 16:36:13

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర యాంకర్ ఆ మధ్య 40 రోజులకు పైగా రెస్ట్ తీసుకున్నాడు. ప్రతిరోజు ప్రతి ఇంటి టీవీలో కనిపించే ప్రదీప్ ఒక్కసారిగా ఇన్ని రోజులు మాయం అయిపోయే సరికి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. అవన్నీ చూసి చాలా నవ్వుకున్నాడు ప్రదీప్. మొత్తానికి మళ్లీ ఇప్పుడు బిజీ అయిపోయాడు ప్రదీప్. 

ఈ మధ్యే మళ్లీ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. దాంతో కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆ గాయం అలాగే పట్టుకుని చాలా రోజుల పాటు షూటింగ్ చేశాడు ప్రదీప్. కానీ రోజురోజుకి ఎక్కువవడంతో నొప్పి మరీ భరించలేనంతగా కావడంతో సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. 

దీనికి 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పీరియాడికల్ ప్రేమకథగా వస్తుంది ఇది. అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. పల్లెటూరి నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఇది వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయింది. ఈ సినిమా కోసం మంచి బడ్జెట్ పెడుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటానంటున్నాడు ఈ యాంకర్. గతంలో యాంకర్స్ హీరోలుగా మారి సక్సెస్ అయింది లేదు.. మరి ప్రదీప్ ఏం చేస్తాడో చూడాలిక.

More Related Stories