English   

టాప్ 30లో సాయి పల్లవి..!!

sai
2020-02-06 19:45:51

సాయి పల్లవి.. ఈ పేరు వింటే చాలు..  భానుమతి ఒక్కటే పీస్.. రెండు కులాలు రెండు మతాలు.. హైబ్రిడ్ పిల్ల.. అంటూ 'ఫిదా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తు కెరీర్ రన్ చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. సంపాదన విషయంలో సినిమా రంగం నుంచి టాప్ 30లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫోర్బ్స్ మ్యాగజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సంపన్నుల లిస్ట్ ను తయారు చేసి.. ఎవరు ఎంత సంపాదిస్తున్నారో ఎప్పటికప్పుడు ఒక లిస్ట్ తయారు చేసి రిలీజ్ చేస్తుంటుంది ఫోర్బ్స్. తాజాగా ఇండియన్ ఫోర్బ్స్.. 30 అండర్ 30 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే సినీ పరిశ్రమ నుంచి.. అది కూడా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇండియాలో 30 ఏళ్లలోపు 30 కోట్లు సంపాదిస్తున్న జాబితాలో సాయి పల్లవి చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది.

సాయి పల్లవికి ఈ జాబితా లో 16వ స్థానం దక్కింది. ఏడాదిలో ఈ అమ్మడి ఆదాయం దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈమె కంటే ఎక్కువ సంపాదించే హీరోయిన్స్ ఉన్నప్పటికీ.. వారంతా 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు అవ్వడంతో వారికి ఇందులో చోటు దక్కలేదు. ముఖ్యంగా సాయి పల్లవి సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఇకపోతే రానాతో కలిసి విరాట పర్వం.. నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ.. సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏదైమైనా.. సాయి పల్లవి సంపాదన చూస్తే మిగతా హీరోయిన్లు కుళ్లుకోవడం ఖాయం.

More Related Stories