English   

ఎన్టీఆర్ 30...నేడే అనౌన్స్మెంట్..ఆయనతోనేనా ..

 NTR
2020-02-19 10:28:10

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. అయితే అనుకున్న దాని ప్రకారం అయితే ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉన్నా రాజామౌళి సినిమా కావడంతో ఈ సినిమా ఏకంగా దగ్గర దగ్గర పది నెలల పాటు వాయిదా పడింది. 

అయితే ఆ విషయం అలా ఉంచితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేదానిపై చాలా రోజులుగా చర్చ నడుస్తుంది. ముగ్గురు, నలుగురు దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తుండగా త్రివిక్రమ్ పేరు అయితే మరింత గట్టిగా వినిపిస్తోంది. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా మంచి విజయం అందుకుంది. అందుకే మళ్లీ త్రివిక్రమ్‌కే మరో ఛాన్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ అనుకున్నారని బహుశా ఈ సినిమా గురించి ఈరోజు అధికారిక ప్రకటన కూడా రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 త్రివిక్రమ్ ఆస్థాన బ్యానర్ అయిన హారికా హాసినీ, లేదా సితార లో ఈ సినిమా తెరకెక్కించవచ్చని అంటున్నారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగామయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

More Related Stories