English   

30 ఇయర్స్ పృథ్వీ ఎక్కడున్నాడబ్బా.. కనబడుట లేదు.. 

Prudhvi Raj
2020-03-27 14:24:28

సినిమాలు.. రాజ‌కీయాలు వేరువేరు. కానీ రెండింటిని ఒక్క‌టి చేయ‌డానికి మ‌నోళ్లు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. రాజ‌కీయాల్లో ఉన్న‌పుడు ఇత‌ర పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం అనేది స‌ర్వ సాధార‌ణం. దాన్ని మ‌ళ్లీ ప‌ర్స‌న‌ల్ గా తీసుకుని.. ఇగోలు పెంచుకుని త‌ర్వాత ప‌గ తీర్చుకోవ‌డం అనేది ఉండ‌దు.. ఉండ‌కూడ‌దు కూడా. అయితే కొన్నిసార్లు మాత్రం రాజ‌కీయాల కోసం చేసింది నిజంగానే ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను కూడా ఇబ్బంది పాలు చేస్తుంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ టాప్ కమెడియన్ పృథ్వీ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయ‌న ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ, జనసేన పార్టీలపై ర‌ప్ఫాడించే విమ‌ర్శ‌లు చేసాడు. 

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ప‌ర్స‌న‌ల్ గా కూడా టార్గెట్ చేసి జనసేన పార్టీ గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేసాడు. ఈ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపదని వ్యాఖ్యలు చేసాడు. అన్న‌ట్లుగానే ప‌వ‌న్ పార్టీ ప్ర‌భావం చూపించ‌లేదు కానీ ఈయ‌న మాట‌లు మాత్రం ఆయ‌న కెరీర్ పైనే ప్ర‌భావం చూపించిన‌ట్లుగా తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మెగా హీరోలు పూర్తిగా ఈ క‌మెడియ‌న్ ను బ్యాన్ చేసార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. చిరంజీవి నుంచి ఇప్పుడు రాబోయే వైష్ణవ్ తేజ్ వ‌ర‌కు అంతా పృథ్వీని త‌మ సినిమాల్లో తీసుకోకూడ‌ద‌నే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. 

అసలే కెరీర్ ఇలా ఉన్నపుడు వెనక నుంచి వచ్చి వాటేసుకోవాలనిపించింది అంటూ పిచ్చి కూతులతో పృథ్వీ టేప్ ఒకటి విడుదలైంది. దాంతో అటు ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి పోయి.. ఇటు సినిమా అవకాశాలు రాక.. ఎటూ కాకుండా పోయింది ప్రస్తుతం పృథ్వీ పరిస్థితి. ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు పృథ్వీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. పూర్తిగా ఈయన్ని దూరం పెట్టేసింది సినిమా ఇండస్ట్రీ. అక్కడ్నుంచి కూడా తననెవరూ చూడ్డానికి రాలేదు.. పలకరించడం లేదు అంటూ ఏడుస్తున్నాడు ఈయన. మొత్తానికి 30 ఇయ‌ర్స్ అంటూ అనుభవం మాత్రమే మిగిలిందిప్పుడు పృథ్వీకి.

More Related Stories