ప్యాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్ 30..సంజయ్ దత్ కీలక రోల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
అదేంటంటే ఈ సినిమాలో విలన్ లాంటి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నారని అంటున్నారు. గతంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమా పాయింట్ తోనే త్రివిక్రమ్ స్టోరీ రాసుకుంటున్నాడని అంటున్నారు. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉంది. చర్చలు జరుగుతున్నాయని, సంజయ్ దత్కు త్రివిక్రమ్ వీడియో కాలింగ్ చేసి మరీ స్టోరీ నెరేట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్ ఫుల్ పాత్ర కావడంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక ప్రస్తుతం సంజయ్ ‘కేజీఎఫ్ 2’లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఏమో ఆర్ఆర్ఆర్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. దానితో ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయచ్చని అంటున్నారు.