30 ఏళ్ళుగా ఆటోలోనే షూటింగ్ కి స్టార్ నటుడు

2020-07-17 07:33:04
బాలీవుడ్ లో సహజనటుడిగా నానా పటేకర్ కు పేరుంది. నిజానికి ఆయన గురించి తెలియని సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఈయన గురించి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించయానుకోండి అది వేరే విషయం. ఈ నటుడు సినిమాల్లో ఎంత సహజంగా వుంటాడో నిజజీవితంలో కూడా అంతే ఉంటాడు. ఈయన ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జీవిస్తుంటాడు. అనేక బాషలలో వందల సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాందించిన ఈయన గత 30 ఏళ్లుగా ఒకే సింగిల్ బెడ్రూమ్లో వుంటున్నాడంటే నమ్ముతారా ?అది కూడా సినిమా పరిశ్రమ కోసం ప్రభుత్వం కట్టించిన కాలనీలో. ఇక ఈయన కెరీర్ ప్రారంభం నుండి షూటింగ్‌లకు కూడా ఆటోలోనే వెళతాడట. నిర్మాతలు కార్లు పంపించినా సున్నితంగా తిరస్కరించి మరీ తాను వచ్చే ఆటోలోనే ఈయన షూట్‌కు వెళతాడట.