జూలై 30న రింగులోకి దిగబోతున్న గని

2021-01-28 14:36:02
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'గని'. లేటెస్ట్ గా ఈ సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక వరుణ్‌తేజ్ మరోవైపు విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్3లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది.