English   

ఓటు వేయడానికి 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన నటుడు..

Actor Shivaji Raja
2020-12-01 13:26:40

సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పోలింగ్ మొదలైన నాలుగు గంటల తర్వాత కూడా వాళ్లు ఏ బూత్ దగ్గర కనిపించలేదు. అయితే మరి కొందరు నటులు మాత్రం తమ బాధ్యతను నిర్వర్తించారు. ఎంత దూరంలో ఉన్నా కూడా ఓటు వేయటం మన బాధ్యత అని గుర్తు పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు. అందులో మరీ ముఖ్యంగా ఒక సీనియర్ నటుడు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఓటు వేసాడు. ఆయన ఎవరో కాదు నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈయన ఒక సినిమా షూటింగ్ కోసం గుంటూరులో ఉన్నాడు.

అక్కడి నుంచి హైదరాబాద్ కు 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఓటు వేసినట్లు తెలిపాడు శివాజీ రాజా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో మున్సిపల్ ఎన్నికలు కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయాన్ని ఓటర్లు గుర్తించాలని ఆయన తెలిపాడు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చాడు శివాజీ రాజా. ఇక గ్రేటర్ ఎన్నికల విషయానికి వస్తే ఓటింగ్ శాతం చాలా మందకొడిగా జరుగుతుంది. ఇప్పటి వరకు కనీసం13 శాతం ఓటింగ్ కూడా లేదు. గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎప్పుడూ ఇదే జరుగుతుంది. 2009లో 42.92 శాతం.. 2016లో 45.27 శాతం.. గత ఎన్నికల్లో 47 శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడైనా 50% శాతం మార్క్ దాటుతుందని నమ్ముతున్నారు.

More Related Stories