డిసెంబర్ 31న థియేటర్లలో రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా

నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న ‘ఒరేయ్ బుజ్జిగా...’ థియేటర్లలో విడుదలవుతుంది. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ని థియేటర్లు తెరుచుకుంటాయో ఇంకా స్పష్టత లేదు. ఒక వేళ థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారే లేదో అనుమానమే. ఇలాంటి పరిస్థితిలో ‘ఒరేయ్ బుజ్జిగా...’కు థియేటర్లో ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.
చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బ్యానర్ లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్టైనర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.`` అన్నారు.