English   

ఎన్టీఆర్ 31 ఇట్స్ అఫీషియల్

Jr NTR
2021-05-20 18:10:34

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ లేనప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం ట్రీట్ అందుతోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 31 పై కూడా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకటించారు. "రక్తంతో మరిగించిన నేల మాత్రమే గుర్తుండిపోతుంది. దాన్ని తయారు చేయడానికి ఎన్టీఆర్ లాంటి శక్తి కావాలి. అదే ఎన్టీఆర్ 31. హ్యాపీ అండ్ సేఫ్ బర్త్ డే బ్రదర్. మైత్రీమూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి." అంటూ ప్రశాంత్ నీల్ ప్రకటించారు. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భాగం అవ్వడం పై అభిమానులు నిరాశతో వున్నారు. అది చిన్న బ్యానర్ అని ఇది భారీ ప్రాజెక్టు అని కాబట్టి డీల్ చేయలేదేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

More Related Stories