English   

వెంకటేష్ కెరీర్ కు 33 ఏళ్లు.. కలియుగ పాండవులుతో ఎంట్రీ.. 

 Victory Venkatesh
2019-08-14 17:11:20

అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటి వరకు హీరోల తనయులు మాత్రమే వారసులుగా ఇండస్ట్రీకి వచ్చారు.. సక్సెస్ అయ్యారు. కానీ మొదటి సారి ఓ నిర్మాత తనయుడు భారీ స్థాయిలో లాంఛ్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది ఆయన సినిమా. కానీ రిలీజ్ తర్వాత అంతా ఆయనే టాపిక్ అయ్యాడు. ఇండస్ట్రీకి మరో కొత్త సంచలన తార దొరికేసాడని అప్పటి పత్రికలు కూడా రాసాయి. అతడే దగ్గుబాటి వారసుడు వెంకటేష్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విక్టరీ హీరో. విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈయన ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 33 ఏళ్లు అయిపోయాయి. రామానాయుడు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించాడు వెంకీ. ఆయన తొలి సినిమా కలియుగ పాండవులు ఆగస్టు 14,1986లో విడుదలై సంచలన విజయం సాధించింది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దీనికి దర్శకుడు. ఈ సినిమాలో ముందు ఇందులో కృష్ణను హీరోగా అనుకున్నాడు రాఘవేంద్రుడు.. కానీ ఆ సమయంలో డేట్స్ కుదరక మరో హీరో అనుకుంటున్న తరుణంలో వెంకటేష్ ను ఎందుకు హీరో చేయకూడదనే ఆలోచన వచ్చింది రామానాయుడుకు. అంతే అప్పటికే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకుని వచ్చిన వెంకటేష్ ఈ సినిమాలో హీరో అయిపోయాడు. నిజానికి అన్నయ్య మాదిరే వెంకటేష్ కూడా బిజినెస్ మెన్ గానో.. లేదంటే నిర్మాతగానో సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ ఆయన్ని హీరో చేసింది విధి. అలా మన ఇండస్ట్రీకి ఓ అద్భుతమైన హీరో దొరికేసాడు. కలియుగ పాండవులు సినిమాతో వెంకీ మాత్రమే కాదు.. ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

More Related Stories