English   

34 రోజుల్లోనే చనిపోయిన 15 మంది బాలీవుడ్ ప్రముఖులు. 2020కి ఓ దండం..

bollywood
2020-06-05 17:23:09

2020 మొదలై ఏదో కొత్త కొత్త మార్పులు తీసుకొస్తుందేమో అనుకుంటే.. అంతా సర్వనాశనం చేస్తుంది. శార్వరినామ సంవత్సరం అంటేనే సర్వనాశనం అయిపోతుందేమో మరి..? ఇదిలా ఉంటే సినిమా వాళ్లకు కూడా 2020 అస్సలు కలిసిరాలేదు. కరోనాతో కోట్ల నష్టాలు వస్తుంటే.. బాలీవుడ్ మాత్రం ప్రముఖులను కోల్పోతుంది. 2020 మొదలై ఆర్నెళ్లు కూడా గడవకముందే 15 మంది సెలబ్రిటీస్ చనిపోయారు. మరీ ముఖ్యంగా కేవలం 34 రోజుల గ్యాప్‌లోనే 15 మంది కన్నుమూయడంతో కోలుకోలేకపోతుంది బాలీవుడ్.

1. ఇర్ఫాన్ ఖాన్: బాలీవుడ్ స్టార్ కారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా కూడా క్రేజ్ తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ ఎప్రిల్ 29న కన్నుమూసారు. ఈయన మరణం అందర్నీ కలిచివేసింది.
2. రిషి కపూర్: ఇర్ఫాన్ మరణం ఇంకా పచ్చిగా ఉండగానే 24 గంటల్లోపే బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ ఎప్రిల్ 30న మరణించారు. ఈయన కూడా కేన్సర్‌తోనే కన్నుమూసాడు.
3. బసు ఛటర్జీ: బాలీవుడ్‌లో రజినీగంథ, చోటీ సీ బాత్ వంటి పలు క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బసు ఛటర్జీ జూన్ 4న కన్నుమూసారు. ఆయన వయసు 93 ఏళ్లు.
4. వాజిద్ ఖాన్: బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు అదిరిపోయే సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్.. కేవలం 42 ఏళ్ల వయసులో కిడ్నీ సమస్యతో పాటు కరోనా వైరస్‌ కారణంగా జూన్ 1న కన్నుమూసాడు.
5. ప్రేక్షా మెహతా: బాలీవుడ్ సీరియల్స్‌తో ఫేమస్ అయిన ప్రేక్షా మెహతా.. మే 29న ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణం అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు.
6. యోగేష్ గౌర్: ప్రముఖ బాలీవుడ్ రచయిత యోగేష్ గౌర్ కూడా మే 29న కన్నుమూసారు.
7. సెజల్ శర్మ: ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి సెజల్ శర్మ ఇదే ఏడాది ఆత్మహత్య చేసుకుంది. దిల్ తో హ్యాపీ జీ సీరియల్‌తో ఈమె గుర్తింపు తెచ్చుకుంది.
8. మోహిత్ భాగెల్: సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సినిమాల్లో నటించి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ భాగెల్.. భయంకరమైన కాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మే 23న కన్నుమూసారు. ఈయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే.
9. నిమ్మి: 50, 60 దశకాల్లో బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటి నిమ్మి 87 ఏళ్ల వయసులో ఈ లాక్‌డౌన్ సమయంలోనే మరణించారు.
10. మన్మీత్ గ్రేవాల్: టీవీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మన్మీత్ గ్రేవాల్ మే 16న ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ప్రాణాలు వదిలేసాడు మన్మీత్.
11. అభిజీత్: షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ సంస్థలో అత్యంత కీలంగా ఉండే అభిజీత్ మే 15న కన్నుమూసారు. ఈయన మృతిపై షారుక్ సంతాపం వ్యక్తం చేసాడు.
12. సాయి గుండేవార్: అమీర్ ఖాన్ పీకే, రాక్ ఆన్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి గుండేవార్ మే 10న బ్రెయిన్ కాన్సర్‌తో బాధ పడుతూ యుఎస్‌లో మరణించాడు.
13. షఫీక్ అన్సారీ: క్రైమ్ పెట్రోల్ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు షఫీక్ అన్సారీ మే 10న అనారోగ్యంతో కన్నుమూసాడు. ఈయన వయసు 52 ఏళ్లు మాత్రమే.
14. అమోస్: అమీర్ ఖాన్ దగ్గర గత పాతికేళ్లుగా పని చేస్తున్న అసిస్టెంట్ అమోస్ మే 12న హార్ట్ ఎటాక్‌తో మరణించారు.
15. సచిన్ కుమార్: కహానీ ఘర్ ఘర్ కీ లాంటి సీరియల్‌తో అందరికీ గుర్తిండిపోయే పాత్ర చేసిన సచిన్ కుమార్ మే 15న గుండెపోటుతో కన్నుమూసాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం విషాదకరం.

More Related Stories