English   

కెజియఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రోజు సంపాదన 35 రూపాయలు..

 KGF
2020-03-31 13:29:14

వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఆయనేంటి రోజుకు కేవలం 35 రూపాయలు సంపాదించడం ఏంటి.. కోట్లు సంపాదించే సంగీత దర్శకుడికి అలాంటి పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కరోనా వైరస్ కారణంగా సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినిమా వాళ్లకు కూడా పెద్దగా పని లేకుండా పోయిందిప్పుడు. దాంతో హాయిగా సొంతూళ్లకు వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అదే లిస్టులో కెజియఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ కూడా ఉన్నాడు.

లాక్ డౌన్ కారణంతో తన సొంతూరికి వెళ్లి అక్కడ తన వృత్తి చేసుకుంటున్నాడు. ఉడిపి దగ్గర కుందాపూర్ ఈయన ఊరు. లాక్ డౌన్ ప్రకటించగానే కుటుంబంతో కలిసి సొంతూరు వెళ్లిన రవి అక్కడ తండ్రికి సాయం చేస్తున్నాడు. దేవుళ్ళ ఆభరణాలు తయారు చేసే వృత్తి వీళ్లది. అందులో రోజుకు ఈయనకు 35 రూపాయల సంపాదన వస్తుందని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇది చూసి అభిమానులు కూడా ఈయన్ని వారెవ్వా అంటున్నారు.
 
ఇంత ఎదిగినా కూడా సొంత వృత్తిని మర్చిపోలేదంటూ పొగిడేస్తున్నారు. కెజిఎఫ్ తర్వాత ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అతని మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హీరో ఎలివేటెడ్ సీన్స్ లో ఆర్ఆర్ అదిరిపోయింది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లోపు లాక్ డౌన్ వచ్చింది. దాంతో చేసేదేం లేక ఇంటికెళ్లిపోయాడు ఈయన. లాక్ డౌన్ తో సినిమా పనులన్నీ ప్రస్తుతానికి పక్కన బెట్టేసాడు రవి. ఈ లాక్ డౌన్ మళ్లీ తనకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందంటూ ఎమోషనల్ అయ్యాడు. దానికి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు రవి. చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం కొందరి వల్లే అవుతుందంటున్నాడు ఈయన. 

More Related Stories