English   

నితిన్ రంగ్ దేకు 35కోట్ల ఆఫర్..38 కోట్లు కావాలట

Nithins Rang De
2020-12-16 14:17:52

యువ హీరో నితిన్ భీష్మ తర్వాత ఆయన నుండి వస్తోన్న మరో ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో రంగ్ దే కు ఓటిటి ప్లాట్ ఫారమ్ ల నుంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. కానీ రేటు దగ్గరే సమస్య అవుతోంది. అన్ని రకాల హక్కులుకు 38 కోట్లు కావాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.  కీలకంగా బేరంలో వున్న జీ టీవీ 35 వరకు అన్ని హక్కులు కలిపి ఆఫర్ చేస్తోంది. ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెండు షెడ్యూల్ లు కూడా పూర్తి చేసుకుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు.

More Related Stories