English   

35 వయసులో 50 కోట్లు సాధించిన త్రిష

Trisha’s 96 Movie Crosses 50 Crore Mark Worldwide
2018-10-28 13:52:03

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇప్ప‌టికే 50 సినిమాల‌కు పైగానే న‌టించేసింది.. స్టార్ హీరోలంద‌రితోనూ జోడీ క‌ట్టేసింది. ఇప్పుడు ర‌జినీకాంత్ తో కూడా న‌టిస్తుంది. ఓ హీరోయిన్ కు ఇంత కంటే కావాల్సింది ఏముంటుంది..? ఇవ‌న్నీ చేసిన హీరోయిన్ త్రిష‌. అయితే ఎన్ని చేసినా కూడా ఒక్క కోరిక మాత్రం త్రిష‌కు అలాగే మిగిలిపోయింది. ఈమె న‌టించిన సినిమా ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కు 50 కోట్ల క్లబ్ లో చేరలేదు. అంటే ఈమె ఫామ్ లో ఉన్న టైమ్ లో 50 కోట్లు చాలా పెద్ద లెక్క‌.. ఈమె ఫామ్ లో లేని టైమ్ లో చిన్న హీరోల‌తో స‌రిపెట్టుకోవాల్సిన ప‌రిస్థితి. అజిత్ ఎన్నై అరింధాల్ లాంటి సినిమాలు 50 కోట్ల మార్క్ అందుకున్నా కూడా అందులో త్రిష కీల‌క‌క‌పాత్ర‌లో న‌టించ‌లేదు.

Trisha 96 Movie

ఇలాంటి టైమ్ లో 96 సినిమాతో తొలిసారి త‌న పేరును 50 కోట్ల సినిమా పోస్ట‌ర్ పై చూసుకుంది త్రిష‌. విజ‌య్ సేతుప‌తి హీరోగా వ‌చ్చిన ఈ 90స్ బ్యాక్ డ్రాప్ ప్రేమ‌క‌థ‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ గానూ విజ‌యం సాధించింది 96 మూవీ. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా విజ‌యంపై త్రిష కూడా చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో పాటు పెట్టలో ర‌జినీకాంత్ తో జోడీ క‌ట్టింది త్రిష‌. ఈ సినిమా ఖచ్చితంగా త‌న కెరీఈర్ కు ఊతం ఇస్తుంద‌ని న‌మ్ముతుంది త్రిష‌. మ‌రి ఈమె న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories