English   

బాలీవుడ్‌లో మరో ప్రముఖ నటుడు కన్నుమూత.. 36 ఏళ్లకే..

Ranjan Sehgal
2020-07-13 07:58:51

బాలీవుడ్‌ను ఏదో శాపం వెంటాడుతుంది. లేకపోతే మరేంటి.. 2020 మరీ దారుణంగా ఉంది వాళ్లకు. ఒకరి మరణం మరిచిపోక ముందే మరొకరు కన్ను మూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల కట్టె కాలేలోపే మరో కట్టె సిద్ధమవుతుందంటారు కదా.. అలాగే ఉంది ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి. ఓ వైపు కరోనా.. మరోవైపు వరస మరణాలు ఇండస్ట్రీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. తాజాగా మరో ప్రముఖ టెలివిజన్ నటుడు రంజన్ సెహగల్ మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన.. మల్టిపుల్ ఆర్గాల్ ఫెయిల్యూర్ కారణంగా కన్ను మూసాడు. ఈయన వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. ఐశ్వర్యారాయ్, రణ్ దీప్ హూడా ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్‌జీత్ సినిమాలో ఈయన నటించాడు. దాంతో పాటు మరో అరడజన్ బాలీవుడ్ సినిమాలు కూడా చేసాడు. క్రైమ్ పెట్రోల్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు రంజన్ సెహగల్. చాలా చిన్న వయసులోనే ఈయన మృతి చెందడంతో సన్నిహితులతో పాటు సహచర నటులు కూడా కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, వాజిద్ ఖాన్ లాంటి ఎందరో ప్రముఖులు చనిపోయారు. 

More Related Stories