English   

గుణ 369 ఫస్ట్ లుక్...కూల్ గా 

Guna 369
2019-05-29 12:32:20

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఈ సినిమా దెబ్బకు ప్ర‌స్తుతం చాలా సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న బైలింగ్యువ‌ల్ మూవీ హిప్పీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్‌ లో కూడా ఒక కీలక రోల్ లో కనిపించ‌నున్నాడు కార్తికేయ. ఆయ‌న న‌టిస్తున్న‌ మరో సినిమా గుణ 369. బోయపాటి అసోసియేట్ అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని తిరుమ‌ల్ రెడ్డి, అనీల్ క‌డియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆరెక్స్ 100 ఫేం చేతన్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. రెడ్ కలర్ షర్ట్ తో,లుంగీ పైకెత్తి కట్టి ,కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే కార్తికేయ అనుకుంటున్నాడు. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.

More Related Stories