English   

అంచనాలను పెంచుతున్న గుణ 369 టీజర్

Guna 369 Teaser
2019-06-17 12:26:38

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ ను కొట్టిన కార్తికేయ, మొన్ననే హిప్పీ అనే సినిమా రిలీజ్ చేసి దెబ్బ తిన్నాడు. ఇక ప్రస్తుఅతం ఆయన నటిస్తున్న సినిమా గుణ 369. ఈ సినిమాకి బోయపాటి దగ్గర చాన్నాళ్ళ పాటు అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఆరెక్స్ 100 సినిమా ఫేం చేతన్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. అదే సినిమాకి పనిచేసిన రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఈ మధ్యనే టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. అందులో కార్తికేయ భారీ కండ‌లు మాత్ర‌మే చూపించి ఫేస్‌ని దాచారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. నిముషం పన్నెండు సెకన్ల ఈ టీజర్ లో లవ్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ మీద కట్ చేశారు. మొత్తంగా చూస్తే ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో కార్తికేయని హ్యాండ్సమ్ గా, అలాగే ఆరెక్స్ 100 లో లాగా వయలేంట్ గా , మరోపక్క లవర్ బాయ్ గా ఇలా పలు విభిన్న పార్స్యల్లో చూపే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాని త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ అనఘ పరిచయమవుతోంది. 

More Related Stories