English   

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గుణ 369

guna
2019-07-04 19:00:05

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి యూత్ లో క్రేజ్ సంపాదించిన కార్తికేయ, మొన్ననే హిప్పీ అనే సినిమా రిలీజ్ చేసినా అది యావరేజ్ గానే ఆడింది. ఆయన నటిస్తున్న తాజా సినిమా గుణ 369. ఈ సినిమాకి బోయపాటి దగ్గర చాన్నాళ్ళ పాటు అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన అర్జున్ జంధ్యాల దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో కార్తికేయని హ్యాండ్సమ్ గా, అలాగే ఆరెక్స్ 100 లో లాగా వయలేంట్ గా , మరోపక్క లవర్ బాయ్ గా ఇలా పలు విభిన్న యాంగిల్స్ లో చూపే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాని వచ్చేనెల 2న విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ఒకచేతిలో రక్తం మరకలతో వేటకొడవలి,మరో చేతిలో వేడివేడి టీ పట్టుకొని కూర్చొని ఉన్న కార్తికేయని చూస్తుంటే ఆరెక్స్ 100 సినిమాకి ఏమాత్రం తగ్గదనిపిస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా మలయాళ భామ అనఘ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సినిమాని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాల సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఆరెక్స్ 100 సినిమా ఫేం చేతన్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. అదే సినిమాకి పనిచేసిన రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు.

More Related Stories