English   

సెన్సార్ పూర్తి చేసుకున్న గుణ 369 !

guna
2019-07-25 19:18:59

ఆర్ఎక్స్ 100 సినిమాతో  హిట్ కొట్టి యూత్ లో క్రేజీ హీరోగా మారిన కార్తికేయ, మొన్ననే హిప్పీ అనే సినిమా  చేశారు. అయితే ఈ హిప్పీ సినిమా  బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కార్తికేయ బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' అనే సినిమాతో లక్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాని వచ్చేనెల 2న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల మీద కొన్ని అనుమానాలు ఉండగా తాజాగా ఈ విషయం మీద అన్ని అనుమానాలను క్లియర్ చేస్తూ సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శిష్యుడి సినిమా కావడంతో ఈ సినిమాకి చాలా కట్స్ చెబుతారని భావించినా ‘ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్య కరమైన విషయమే మరి. ఈ సినిమా నుండి విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా సినిమా ట్రైలర్ దెబ్బకి సినిమా అంచనాలు కూడా పెరిగిపోయాయి. అంతే కాక ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల ఈ సినిమా కధ ఊహించి రాసింది కాదని, య‌థార్థ ఘటనల స్ఫూర్తితో ఈ కధ రాసుకున్నానని చెబుతుండడంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా మలయాళ భామ అనఘ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సినిమాని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాల సంయుక్తంగా నిర్మించారు. ఆరెక్స్ 100 సినిమా ఫేం చేతన్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించారు.

More Related Stories