English   

అల వైకుంఠపురములో 37 డేస్ కలెక్షన్స్.. బన్నీ ఆల్ టైమ్ రికార్డ్స్..

 Ala Vaikunthapurramloo
2020-02-19 16:30:51

37 రోజుల తర్వాత కూడా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఫైనల్ రన్ కు చేరువైంది. నాలుగు వారాల తర్వాత కూడా ఈ చిత్రం కొన్ని చోట్ల మంచి వసూళ్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా నైజాంలో అయితే 44 కోట్ల షేర్ వసూలు చేసి బాహుబలి తొలి భాగం రికార్డులను కూడా తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 129 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 

ఈ క్రమంలోనే బాహుబలి 1 రికార్డులు కూడా తిరగరాసింది బన్నీ సినిమా. బాహుబలి ది బిగినింగ్ తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు బన్నీ సినిమా 129 కోట్లు వసూలు చేసింది. దాంతో నాన్ బాహుబలి 2 రికార్డులను తిరగరాసాడు అల్లు అర్జున్. మళయాలంలో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 37 రోజుల్లోనే 159 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా 3.5 మిలియన్ క్లబ్బులో చేరిపోయిన ఈ చిత్రం షేర్ 19 కోట్ల వరకు వసూలు చేసింది. కర్ణాటకలో 12 కోట్ల మార్క్ దాటేసింది. తమిళనాట కూడా 3 కోట్లకు పైగానే షేర్ తీసుకొచ్చింది. మళయాలంలో 3.5 కోట్ల వరకు వసూలు చేసింది అల వైకుంఠపురములో. 

85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల వైకుంఠపురములో తొలివారంలోనే బయ్యర్స్ అందర్నీ సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాతో దాదాపు 80 కోట్ల లాభాలు అందుకున్నారు బయ్యర్లు. ఈ సినిమా దెబ్బకు రవితేజ డిస్కో రాజా, అశ్వథ్థామ, జాను లాంటి సినిమాలు కూడా తట్టుకోలేకపోయాయి. ఇన్నేసి కోట్లు నిజంగానే వస్తున్నాయా లేదా అనేది మాత్రం ప్రేక్షకుల్లో అనుమానాలు అలాగే ఉండిపోతున్నాయి. మొత్తానికి ఈ సినిమా సన్ నెక్ట్స్ లో ఎప్రిల్లో విడుదల కానుంది.

More Related Stories