English   

డిజాస్టర్ డైరెక్టర్ తో అఖిల్ 4 

Akhil-4
2019-01-30 12:07:46

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ మూడో ప్రయత్నంలోనూ విజయాన్ని అందుకోలేకపోయారు. వినాయక్ డైరెక్టర్ గా మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ రెండవ సినిమా హలో తో పర్వాలేదనిపించినా మూడోచిత్రం మిస్టర్ మజ్ను అయినా విజయం సాదిస్తుందనుకుంటే ఇది కూడా యావరేజ్ చిత్రంగా మిగిలి ఆయనకు బ్యాడ్ టైం తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు అఖిల్ నాల్గవ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్ తన నాలుగో సినిమాను శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని అంటున్నారు. అఖిల్ కోసం శ్రీను వైట్ల కథను కూడా సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు, అఖిల్‌తో తన సినిమా ఉంటుందని ఇటీవల శ్రీను వైట్ల ఇటీవల స్వయంగా ప్రకటించడంతో శ్రీను వైట్లతో అఖిల్ సినిమా ఖాయమని అంతా అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో శ్రీను వైట్ల ఫామ్ అస్సలు బాగాలేదు. ఆయన సినిమాలన్నీ వరుసగా పరాజయాలు చెందాయి. తాజాగా వచ్చిన అమర్ అక్బర్ అంటోనీ కూడా నిరాశ పరచడంతో శ్రీను వైట్లకి నిర్మాతలే కనబడడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీను వైట్లతో అఖిల్ సినిమా చేయడానికి నాగార్జున అంగీకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories