English   

‘యాత్ర’4 డేస్ క‌లెక్ష‌న్స్...సేఫ్ జోన్లోకి !

Yatra
2019-02-12 11:23:08

వైఎస్ సీఎం అవ్వడానికి దోహదం అయిన పాదయాత్ర ప్రధాన కధాంశంగా తీసుకుని ఆనందో బ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ తెరకెక్కించిన సినిమా యాత్ర. అయితే సినిమాలో ఎటువంటి వివాదాస్పద సబ్జెక్ట్స్ టచ్ చేయకపోవడం, మొదటి ఆట నుండి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. తొలి రోజు మూడు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత వీకెండ్ రావడంతో విడుదలయిన మొదటి మూడు రోజుల్లో 6 కోట్ల 12 లక్షల షేర్ వసూలు చేసి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక నాలుగు రోజుల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. ఎమోషనల్ గా హిట్ అయ్యిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. వైఎస్ పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టీ నటించారు అనడం కంటే జీవించారు అనడం కరెక్ట్ ఏమో ! ఆయన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని కేరళలో కూడా రిలీజ్ చేయడంతో ఆ వసూళ్లు కూడా సినిమాకి ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే వైఎస్ కుటుంబం నుండి సినిమాకి మంచి సపోర్ట్ లభించింది. కొన్ని కొన్న వాస్తవికతకి దూరంగా ఉన్న అంశాలు ఉన్నా వాటిని జనానికి అర్ధం కాకుండా తెరకెక్కించడంలో మహీ సక్సెస్ అయ్యాడు. మ‌రో రెండు వారాల వ‌ర‌కు సినిమాలే లేక‌పోవ‌డం కూడా యాత్ర‌కు కలెక్షన్ల పరంగా క‌లిసి రానుంది. కార్తి దేవ్ సినిమా వ‌స్తున్నా దాని మీద పెద్ద‌గా అంచ‌నాలు అయితే లేవు. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సేఫ్ జోన్ చేరి హిట్ అనిపించుకోవ‌డం పెద్ద కష్టమేమీ కాదేమో ?.

More Related Stories