English   

అప్పుడే కాంచన 4...ఈసారి వంద కోట్ల బడ్జెట్ అట

kanchana
2019-04-29 20:24:05

లారెన్స్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాంచన 3' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగులో జెర్సీ సినిమాతో పోటీ పడి మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. కాంచన-ముని సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బీ సీ సెంటర్ల వారిని నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ విజయం పట్ల లారెన్స్ ఆనందాన్ని వ్యక్తం చేసిన లారెన్స్. కాంచన 4 విషయాన్ని కూడా ప్రకటించాడు. ఆ సినిమా కూడా తప్పకుండా ఉంటుందని పేర్కొన్న ఆతన ఆ కథపై ఇకనుండి ద్రుష్టి పెడతానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ చూసిన సన్ పిక్చర్స్ వారు కాంచన 4 సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. కాంచన 3 విషయానికి వస్తే అక్కడక్కడా ఈ సినిమాలో బడ్జెట్ లోటు కనిపిస్తుంది, అది కనపడకుండా ఈ సారి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి వాళ్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను '3డీ'లో కూడా చేయాలనీ భారీస్థాయిలో గ్రాఫిక్స్ ను ఉపయోగించాలని అలాగే చిన్నాచితకా వారిని కాకుండా భారీ స్టార్ క్యాస్టింగ్ తీసుకోవాలని అనుకోవడం వలన, ఈ సినిమాకి ఈ స్థాయి ఖర్చు అవుతుందని అంటున్నారు. 

More Related Stories