English   

బిగ్ బాస్ సీజన్ 4 కోసం యంగ్ టైగర్‌కు వలేస్తున్న స్టార్ మా..

ntr
2020-01-11 06:55:52

బిగ్ బాస్ అనే రియాల్టీ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది జూనియర్ ఎన్టీఆర్. దాన్ని దగ్గర చేసింది కూడా ఈయనే. అసలు మనోళ్లు ఇలాంటి షోలు తెలుగులో చూస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ తన హోస్టింగ్ తో బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్. 2017లో వచ్చిన రియాల్టీ షో కోసం దాదాపు 8 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు యంగ్ టైగర్. అయితే రెండో సీజన్ మాత్రం ఎన్టీఆర్ హోస్ట్ చేయలేదు. అప్పుడు ఆయన వరస సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ సీజన్ 2 నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి నాచురల్ స్టార్ నాని వచ్చాడు. ఎన్టీఆర్ రేంజిలో కాకపోయినా నాని కూడా బాగానే ఆకట్టుకున్నాడు. మూడో సీజన్ నాని పోయి నాగార్జున వచ్చాడు. తొలి రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ రేటింగ్స్ పరంగా కాస్త వెనుకబడింది. మొదట్లో దుమ్ములేపినా కూడా రాను రాను బాగా తగ్గిపోయింది బిగ్ బాస్ 3. దాంతో నాలుగో సీజన్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఈసారి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి కానుంది. అంటే బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అవుతాడు. దాన్ని తమ షో కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోంది స్టార్ మా యాజమాన్యం. ఈ సారి ఎన్టీఆర్ తో చాలా డిఫరెంట్ గా షో ప్లాన్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల షోలో ఎక్కువుగా రొటీన్‌గా కాన్సెఫ్ట్ లు.. టాస్క్ లు ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. నాలుగో సీజన్లో అవి రాకుండా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ కోసం ఎన్టీఆర్ హోస్ట్ చేసేందుకు ఒప్పుకుంటే ఆయనకు భారీ రెమ్యునరేషన్‌.. ఇంకా చెప్పాలంటే 20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అన్నీ కుదిరి నాలుగో సీజన్ కోసం నందమూరి చిన్నోడు వచ్చాడంటే బిగ్ బాస్ రేటింగ్స్ లో బాక్సులు బద్దలు కొట్టడం ఖాయం. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న RRR సినిమా షూటింగ్ మార్చ్ లోపు పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అట్లీ కుమార్ లాంటి దర్శకులతో సినిమాలు అంటున్నారు కానీ ఇందులో ఏది కన్ఫర్మ్ అవుతుందనేది తెలియడం లేదు. దాంతో కొన్ని రోజుల వరకు ఎన్టీఆర్ ఫ్రీగానే ఉంటాడు. ఆ సమయాన్ని తమ షో కోసం వాడుకోవాలని చూస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఒకవేళ అన్నీ కుదిరి మళ్లీ ఎన్టీఆర్ వస్తే ఈ సారి సీజన్ దుమ్ము లేపడం ఖాయం.

More Related Stories