English   

బిగ్ బాస్ 4 హోస్ట్ సమంతనా...నిజమేనా 

 Samantha
2020-06-27 18:08:26

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి మూడు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి మూడు  సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున చేయగా ఇప్పుడు బిగ్ బాస్ 4 కి కూడా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ పేరు బాగా వినిపించింది. అయితే తాజాగా అక్కినేని నాగార్జున మూడో సీజన్ చేశారు కాబట్టి ఆయన కోడలు సమంతను ఈ సీజన్ హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ కి ఇప్పటి దాకా ఫిమేల్ సెలబ్రిటీ హోస్ట్ చేయలేదు. దాంతో సమంతకు అరుదైన గౌరవం దక్కిందని ఆమె ఫ్యాన్స్ సంబరాపడుహ్తున్నారు. అయితే అదేదీ నిజం కాదని తేలింది. ఆమెను అసలు షో నిర్వాహకులు కన్సిడర్ చేయలేదని అంటున్నారు. చూడాలి ఈ సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారు అనేది. 

More Related Stories