బిగ్బాస్ 4 .. స్టార్ మా కీలక ప్రకటన

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి మూడు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి మూడు సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది బిగ్బాస్ షో ఉంటుందా? లేదా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్బాస్ సీజన్-4 పై స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది నిన్న. త్వరలోనే బిగ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మా ప్రకటించింది. ఈ మేరకు బిగ్బాస్ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే బిగ్బాస్ 4పై స్టార్ మా క్లారిటీ ఇవ్వడంతో అందులో పాల్గొనే కంటెస్టెంట్లు, హోస్ట్ వివరాలపై అందరిలో ఆసక్తి మొదలయింది.