English   

 బిగ్ బాస్ 4 గురించి ఎక్స్ క్లూజివ్ అప్డేట్ 

 Nagarjuna
2020-07-22 21:16:04

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి మూడు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి మూడు  సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున చేయగా ఇప్పుడు బిగ్ బాస్ 4 కి కూడా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ పేరు బాగా వినిపించింది.

అయితే తాజాగా అక్కినేని నాగార్జున మూడో సీజన్ చేశారు కాబట్టి ఆయన కోడలు సమంతను ఈ సీజన్ హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ సీజన్ కు కూడా గత సీజన్ కు హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే మళ్లీ హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. అంతే కాక ఈసారి ఈ షోలో పాల్గొననున్న కంటెస్టెంట్స్ ఎంపిక స్టార్ మా ఆఫీస్ లో కాకుండా వీడియో కాలింగ్ ద్వారానే ఎంపిక చేశారని చెబుతున్నారు. గత సీజన్ లా కాకుండా ఈ సీజన్ లో సెన్సేషనల్ పేర్లనే ఎంపిక చేశారని అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్స్ ను కరోనా వలన భారీగా కోసేసారని అంటున్నారు. అయితే నాగార్జున మాత్రం తన రెమ్యునరేషన్ పెంచినట్టు చెబుతున్నారు. 

More Related Stories