English   

బిగ్ బాస్ 4లో కూడా ఓ సెలబ్రిటీ కపుల్ 

RAGHU MASTER AND PRANAVI
2020-07-25 13:45:46

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. తెలుగులో ఇప్ప‌టికే మూడు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కొద్ది రోజుల‌లో నాలుగో సీజ‌న్‌ కి రెడీ అవుతోంది. అయితే కరోనా కారణంగా అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్రోమో కూడా విడుద‌లవడంతో అది ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్‌గా ఉంటార‌ని తెలుస్తుండ‌గా, కంటెస్టెంట్‌ల విష‌యంలో ప‌లువురు ప్రముఖుల పేర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ సీజన్ లో కూడా గత సీజన్ లో చేసిన ఒకటి బాగా వర్కౌట్ కావడంతో ఈ సీజన్ లో కూడా అది ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. 

అదేంటంటే గ‌త సీజ‌న్‌లో హీరో వ‌రుణ్ సందేశ్‌, అత‌ని భార్య వితిక పాల్గొని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఈ సీజ‌న్‌లో కూడా టాలీవుడ్ క‌పుల్ పాల్గొనే అవకాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొరియోగ్రాఫర్ రఘు ఆయన భార్య సింగర్ ప్రణవి ఈ సీజ‌న్ 4లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత సీజన్ లో మొగుడు పెళ్ళాల వల్ల మంచి రేటింగ్స్ వచ్చాయని భావిస్తున్న టీమ్ ఈసారి కూడా అలానే ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. 

More Related Stories