బిగ్ బాస్ 4 ప్రోమో ..షాకింగ్ లుక్ లో నాగ్

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి మూడు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి మూడు సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున చేయగా ఇప్పుడు కూడా బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా ఆయనే చేస్తున్నారు. మొన్నీ మధ్య ఆయన మీద ఒక ప్రోమో షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా నాగార్జున నటించిన బిగ్‌బాస్ ప్రోమోను నిన్న విడుదల చేసారు. ఇందులో నాగార్జున ఎలాంటి మేకప్ లేకుండా తన ఒరిజినల్ ఏజ్ తో కనిపించాడు. ఒక ముసలాడిలా గెటప్‌లో దర్శనమిచ్చిన నాగ్ టెలీ స్కోప్ పెట్టుకొని బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతోందో చూడాలనే ఆరాటంలో ప్రేక్షకులు ఉన్నట్టు అర్ధం వచ్చేలా ఈ టీజర్‌ను డిజైన్ చేసారు. ఇక ఈ బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు నుండి మొదలు పెట్టి 30 నుంచి రెగ్యులర్ గా ఈ షోను ప్రసారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లు అందరినీ ఇప్పటికే క్వారెంటైన్ కు తీసుకున్నారని అంటున్నారు.