English   

షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్‌కు కరోనా..

Bigg Boss Telugu Season 4
2020-08-25 18:18:59

ఇంకా మొదలు కూడా కాలేదు అప్పుడే నిర్వాహకులకు బిగ్ బాస్ సీజన్ 4 చుక్కలు చూపిస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే హంగామా మామూలుగా ఉండదు. అలాగే నిర్వాహకులకు కూడా చాలా పనులు ఉంటాయి. కంటెస్టెంట్స్.. వాళ్ల అగ్రిమెంట్స్.. కథ కాకరకాయ్ అంటూ చాలా ఉంటాయి. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా చూస్తుంటారు. అన్నీ ఓకే అనుకుంటే కానీ ఇంట్లోకి పంపరు. అలాంటిది ఈ సారి కరోనా బోనస్.. వాళ్లందరికీ నెగిటివ్ అని తేలిన తర్వాత కానీ లోపలికి వెళ్లే ఆస్కారమే లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. 4వ సీజన్ కోసం ఇప్పటికే 16 మందిని ఎంపిక చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో విడివిడిగా క్వారంటైన్ చేసినట్లు తెలుస్తుంది. అందరికీ టెస్టులు చేస్తే నెగిటివ్ అని వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. 

అయితే ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చింది. 16 మంది కంటెస్టెంట్స్‌లో తాజాగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 10 రోజుల కింద చేసినపుడు నెగిటివ్ వచ్చినా.. ఇప్పుడు మాత్రం అతడికి పాజిటివ్ అని తేలినట్లు కన్ఫర్మ్ అయింది. దాంతో మళ్లీ తలనొప్పులు మొదలైపోయాయి. అతడు యువ గాయకుడు అని తెలుస్తుంది. కుర్రాడు కావడం.. పెద్ద వయసు కాకపోవడంతో వెంటనే తగ్గిపోతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. షో మొదలు కావడానికి మరో వారం రోజులు ఉండటంతో అప్పటికి తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఒకటి రెండు వారాలు అయిన తర్వాత పూర్తిగా కోలుకున్నాక మధ్యలో వచ్చే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు మా టీవీ యాజమాన్యం. మొత్తానికి షో మొదలవ్వక ముందే బిగ్ బాస్ లోకి కరోనా ఎంట్రీ ఇచ్చేసింది. 

More Related Stories