తెలుగు బిగ్ బాస్ సీజన్ 4...ఆరోజు నుండే

తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. మొదటి మూడు సీజన్లు జరిగేప్పుడు జనాలు అది చూడడం కోసమే పనులు అన్నీ మానుకుని కూర్చుటున్నారంటే దానికి వచ్చిన క్రేజ్ మనకి అర్ధం అవుతుంది. మొదటి మూడు సీజన్లు విజయంవంతంగా పూర్తవడంతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున చేయగా ఇప్పుడు కూడా బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా ఆయనే చేస్తున్నారు. మొన్నీ మధ్య ఆయన మీద ఒక ప్రోమో షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 30 నుండి షో ప్రారంభం కాబోతుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ షో మరో వారం రోజులు ఆలస్యం అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభ తేదీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. కంటెస్టెంట్స్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో వారం ఆలస్యంగా షోను ప్రారంభించబోతున్నారని అంటున్నారు. ఈ సారి సెప్టెంబర్ 6 తారీకు నుండి ఈ షోను షురూ చేయబోతున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.