English   

ఎవరు మమ్మీ వీళ్ళు.. బిగ్ బాస్ 4 లో తెలియని మొహాలు

Bigg Boss 4 Telugu
2020-09-08 09:05:24

బిగ్ బాస్ షోలోకి సెలబ్రిటీలను పంపిస్తారు. కానీ ఇప్పుడు స్టైల్ మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ షో లోకి వచ్చిన తర్వాత వాళ్లు సెలబ్రిటీలు అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మొదలైన సీజన్ 4 లో చాలా మంది కనీసం ప్రేక్షకులకు తెలియదు. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎవరికీ ఐడియా లేదు. వాళ్ల గురించి వాళ్లు చెప్పుకోవడం తప్పిస్తే గూగుల్ తల్లికి కూడా సగం మంది గురించి తెలియదు. ఈ సీజన్ లో ఉన్న వాళ్ళలో టీవీ 9 దేవి, లాస్య, యూట్యూబ్ గంగవ్వ, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, దేత్తడి హారిక, కరాటే కళ్యాణి, నోయల్ వీళ్లు మాత్రమే తెలిసిన మొహాలు. మిగిలిన వాళ్ల గురించి చాలా మందికి తెలియదు. 

అందులో మరీ ముఖ్యంగా దివి అనే అమ్మాయి ఉంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అలాగే అరియనా గ్లోరీ కూడా.. ఈ అమ్మాయి గురించి కూడా ఎవరికీ ఐడియా లేదు. అలాగే జోర్దార్ సుజాత, సోహెల్ రియాన్, మహబూబ్ షేక్, అఖిల్ సార్థక్, అభిజిత్ వీళ్ల గురించి కూడా ప్రేక్షకులకు అసలు ఐడియా లేదు. కానీ వాళ్ళందర్నీ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. గత మూడు సీజన్ లతో పోలిస్తే ఈ సారి వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరికీ తెలియదు. పూర్తిగా కొత్త మొహాలు తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పరిచయం చేస్తున్నారు. కాకపోతే ఈ సారి ఎక్కువగా గ్లామర్ కంటెంట్ ఉండేలా చూసుకున్నారు. అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పని అమ్మాయిలను ఎంచుకున్నారు. మరి ఈ తెలియని మొహాలతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

More Related Stories