English   

బిగ్ బాస్ 4లో సంచలనాలు సృష్టిస్తున్న గంగవ్వ..

 Gangavva
2020-09-09 20:41:24

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై ఇంకా మూడు రోజులు కూడా గడవలేదు. అప్పుడే సీనియర్ కంటెస్టెంట్ గంగవ్వ సంచలనాలు సృష్టిస్తుంది. ఈమె తొలి వారం నామినేషన్స్ లోకి వెళ్లడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నీ కోసం మేము ఉన్నాం అంటూ ఈమెకు ఓట్లు గుద్దుతున్నారు. ఈ ఓటింగ్ పర్సంటేజ్ లో కనీసం గంగవ్వ కు దరిదాపుల్లో కూడా మిగిలిన కంటెస్టెంట్ లు లేకపోవడం గమనార్హం. ఈమెకు ఏకంగా 50 శాతం పైగా ఓట్లు పడుతుంటే.. మిగిలిన 50 శాతం ఆరుగురు కంటెస్టెంట్ లు పంచుకుంటున్నారు. ఈ లెక్కన గంగవ్వ తొలివారం ఈజీగా సేవ్ అయిపోవడం గ్యారెంటీ. దానికి తోడు సోషల్ మీడియాలో గంగవ్వ ఆర్మీ మొదలైపోయింది. ఈమె కోసమే చూస్తున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. స్టార్ మా యాజమాన్యం గంగవ్వను బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. వాళ్ల ప్లాన్ కూడా వందకు వందశాతం వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ అవ్వ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు రేటింగ్స్ అదిరిపోవడం ఖాయం. పైగా బయట ఆడియన్స్ కూడా గంగవ్వకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు సిచ్యువేషన్ చూస్తుంటే ఆమెను బయటకు పంపించే ఉద్దేశం కాదు కదా.. ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. ఈ సపోర్టు ఇలాగే కొనసాగితే గంగవ్వని చూసి మిగిలిన కంటెస్టెంట్ లు భయపడే రోజు వస్తుంది. 

More Related Stories