English   

బిగ్ బాస్-4 : మోనాల్ అఖిల్ మధ్య పెళ్లి డిస్కర్షన్..!

Monal Gajjar Bigboss4.jpg
2020-09-26 20:16:28

బిగ్ బాస్-4 లో కంటెస్టెంట్ లు జనాలకు పెద్దగా పరిచయం లేకపోయినా మెల్లి మెల్లిగా తమ టాలెంట్ ని బట్టి హౌస్ లోకి వచ్చాక ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు. కొంతమంది టాస్కుల్లో ఆవేశం చూపిస్తూ ఫేమస్ అవుతుంటే కొందరు పులిహోర కలపడంలో బిజీ అయ్యిమరీ ఫేమ్ తెచ్చుకుంటున్నారు.

అఖిల్ సార్ధక్ అంటే బిగ్ బాస్ కి ముందు ఎవ్వరికీ తెలియదు కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మోనాల్ తో ప్రేమాయణం నడుపుతూ తెగ పాపులర్ అయిపోయాడు. అయితే మోనాల్ మాత్రం ఇటు అభిజిత్ తోను అటు అఖిల్ తోనూ ఉంటూ అసలు ఎవరికి పడిపోయిందో అర్థం కాకుండా ప్రవర్తిస్తోంది.

తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అభిజిత్ తో మాట్లాడినందుకు నువ్ ఫీల్ అయ్యవా అంటూ అఖిల్ ను ప్రశ్నించింది. దాంతో అఖిల్ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడకు రాలేదని చెప్పడంతో సైలెంట్ అయ్యింది. ఇక మళ్ళీ కూల్ చెయ్యడానికి రాత్రి గోరు ముద్దలు తినిపించింది.

ఇదిలా ఉండగా మరోవైపు అభిజిత్ తో మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం అని చెపుతుంది. దాంతో అసలు హౌస్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కావడంలేదు. మోనాల్ లవ్ ట్రాక్ తోనే ఫేమస్ అయ్యి ఫైనల్ వరకు ఉండలనుకుంటుందా అని ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. ఇక మోనాల్ చివరికి ఎవరికి ఒకే చెబుతుందో చూడాలి.

More Related Stories