English   

బిగ్ బాస్ 4లో ఈ వారం ఆ నవ్వు దూరం అయిపోతుందంట..

Sujatha
2020-10-10 19:45:18

బిగ్ బాస్ 4 మొదలై అప్పుడే నాలుగు వారాలు గడిచిపోయింది. ఇప్పుడు ఐదో వారం నడుస్తుంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అభిజీత్ ప్రతీవారం నామినేషన్స్‌లో ఉంటున్నాడు.. సేవ్ అవుతున్నాడు. ఇక అఖిల్, మోనాల్, లాస్య లాంటి వాళ్లకు కూడా మంచి పాపులారిటీ ఉంది. నోయల్ కూడా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సోహైల్ కెప్టెన్ అయ్యాడు.. దానికితోడు ఇంట్లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. అమ్మ రాజశేఖర్ కూడా నామినేషన్స్ లో ఉన్నా ఆయన సేవ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ వారం సుజాత ఒక్కటే డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ నవ్వు ఇక దూరం కానుందని ప్రచారం జరుగుతుంది. 

ఎందుకంటే బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ముందు సుజాతపైనే ఫైర్ అవుతున్నారు. ఆమెది తెచ్చి పెట్టుకున్న నవ్వు.. పూర్తిగా ఫేక్ పర్సన్ అంటూ ఆరోపించారు. అదే ఇప్పుడు సుజాతకు మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా ఈ వారం సుజాత అంతా డైలమాలోనే కనిపించింది. బయటికి వెళ్లిపోతానేమో అనే భయంతోనే ఉండిపోయింది. ఇప్పుడు అదే నిజం కాబోతుందని తెలుస్తుంది. 5వ వారం సుజాత ఎలిమినేట్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. అమ్మ రాజశేఖర్, సుజాత చివరి వరకు ఉండి.. సుజాతను బయటికి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. మొత్తానికి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories