English   

బిగ్ బాస్4 మెహబూబ్ దిల్ సే అవుట్..ప్రూఫ్ ఇదే

 Mehboob
2020-11-15 11:36:46

బిగ్ బాస్ సీజన్-4 వారాలు గడుస్తున్న కొద్దీ ఎలిమినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ పదోవారంలోకి అడుగుపెట్టింది. ఇక పదివారంలో ఎన్నో ట్విస్టులు..గోడవలతో హౌస్ లో హీట్ పెరిగింది. ఇక ఇప్పటివరకు ఇంటిసభ్యుల్లో నుండి సాయి కిరణ్, కరాటే కల్యాణి, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, సుజాత, దివి, అమ్మారాజశేకర్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు హౌస్ లో నుండి గంగవ్వ, నోయల్ లు అనారోగ్యం కారణంగా భయటకు వచ్చారు. ఇదిలా ఉండగా ఇక పదో వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ బజ్ షోలో మెహబూబ్ కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దాంతో మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు క్లారిటీ వచ్చేసింది. అసలు నిజానికి మెహబూబ్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండీడేట్ కానీ బిగ్ బాస్ యే మెహబూబ్ ను కొన్ని వారాల నుండి కాపాడుకుంటూ వస్తున్నాడు. మెహబూబ్ టాస్కుల్లో గొడవలు పెట్టడంతో టిఆర్పీ పెరుగుతుందని భావించిన బిగ్ బాస్ ప్రతి వారం అతడిని ఏదో ఒకరకంగా కాపాడాడు. ఇమ్యూనిటీ ఇవ్వడం..అతడి స్నేహితుల ద్వారా కాపాడటం లాంటి పనులు చేసాడు. కానీ భయట మాత్రం అతడు టాస్కుల్లో చూపే ఆటిట్యూడ్ కు ప్రేక్షకులో నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎట్టకేలకు మెహబూబ్ హౌస్ నుండి భయటకు వచ్చాడు.

More Related Stories