English   

బిగ్ బాస్4.. ఆ ఇద్దరికీ సపోర్ట్ చేస్తున్న నాగబాబు

Naga Babu
2020-11-25 12:13:45

బిగ్ బాస్ సీజన్-4 గత సీజన్లతో పోలిస్తే ఎక్కువ రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం 12 వ వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ లో నామినేషన్ ప్రక్రియ మరింత కీలకంగా మారింది. గడిచిన వారాల్లో నామినేషన్ అంటే ఒక సభ్యుడు మరో సభ్యుడిలో నచ్చని క్వాలిటీని లేదంటే మైనస్ పాయింట్ ను చెప్పి నామినేట్ చేసేవిధంగా ఉండేది. కానీ పదకొండో వారం నుండి టాస్కులు ఇస్తూ అందులోనే నామినేషన్ ప్రక్రియను ఇస్తూ..మరోవైపు టాస్కులు ఇచ్చి సేవ్ చేస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పన్నెండోవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అవినాష్, మోనాల్, అఖిల్, అరియనా లు నామినేట్ అయ్యారు. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఓ టాస్క్ అందులో గెలిచిన అవినాష్ కు ఏకంగా రెండు వారాల పాటు హౌస్ లో ఉండేలా ఇమ్యూనిటీని ఇచ్చారు. 

కాకపోతే అవినాష్ దాన్ని ఒక్కసారే వాడుకోవాలి. మరో రెండు వారాలు హౌస్ లో ఉంటే కంటెస్టెంట్స్ ఫైనల్ కు చేరుకున్నట్టే. ఇక అవినాష్ ఫైనల్ కు చేరడంతో ఆయనకు జబర్దస్త్ మిత్రులు ఓట్లు వేయాలని సపోర్ట్ చేస్తున్నారు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను లు ఇప్పటికే అవినాష్ కు ఓట్లు వేయాలని తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఇక ఇప్పుడు అవినాష్ ను కాపాడటానికి నాగబాబు కూడా రంగంలోకి దిగారు. అవినాష్ కు ఓట్లు వేయాలని నాగబాబు కుడా కోరుతున్నారు. మరోవైపు నాగబాబు అభిజిత్ కు కూడా సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని కోరుతుండటం విశేషం. దాంతో అభిజిత్ కు నాగబాబు కు సంబంధం ఏంటనే ప్రశ్న కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యింది.

More Related Stories